శ్రతి హాసన్ తో బ్రేకప్ చెప్పేసిన మైఖేల్... ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడి!
Advertisement
ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్, లండన్‌ థియేటర్‌ ఆర్టిస్ట్‌ మైఖెల్‌ కోర్సేల్‌ విడిపోయారు. గత కొంత కాలంగా పీకల్లోతు ప్రేమలో ఉన్న ఇద్దరూ ఇప్పుడు బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించిన మైఖేల్, జీవితం తామిద్దరినీ వ్యతిరేక మార్గాల్లో ఉంచిందని అనడం గమనార్హం. తామిద్దరమూ ఇక ఒంటరి మార్గాల్లో నడవాల్సి రావడం దురదృష్టకరమని, శ్రుతి ఎప్పటికీ తన బెస్ట్ ఫ్రెండేనని అన్నాడు. శ్రుతితో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్న మైఖేల్, తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పాడు.

కాగా, ఇద్దరూ మాట్లాడుకుని, ఇష్టపూర్వకంగానే విడిపోయారని శ్రుతి సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, 2016లో లండన్ కు వెళ్లిన శ్రుతికి మైఖేల్ పరిచయం కాగా, వీరిద్దరి మధ్యా మొదలైన స్నేహం ప్రేమగా మారింది. మైఖేల్ కోసం నెలకోసారైనా శ్రుతి లండన్ వెళ్లి వస్తుండేది. శ్రుతి ఇంట్లో జరిగిన పలు శుభకార్యాలకు సైతం మైఖేల్ రావడంతో వీరిద్దరి వివాహం ఖాయమన్న వార్తలు వచ్చాయి.
Fri, Apr 26, 2019, 10:26 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View