అఖిల్ జోడీగా ఆమెనే ఖరారు చేశారు
Advertisement
అఖిల్ తన నాల్గొవ సినిమా షూటింగు కోసం సిద్ధమవుతున్నాడు. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం చాలామంది పేర్లను పరిశీలించారు. రష్మిక మందనను ఎంపిక చేసుకునే అవకాశాలు వున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆమెనే ఎంపిక చేశారనేది తాజా సమాచారం.

యూత్ లో రష్మికకి మంచి క్రేజ్ వుంది .. ఆ క్రేజ్ ఈ సినిమాకి హెల్ప్ అవుతుందని భావిస్తున్నారు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్స్ కి రప్పించే కంటెంట్ ను భాస్కర్ సిద్ధం చేసుకున్నాడు. అఖిల్ కి తొలి హిట్ ఇవ్వాలనే పట్టుదలతో వున్నాడు. మే నెలలో ఈ ప్రాజెక్టును లాంచ్ చేసి, ఆ వెంటనే రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.
Fri, Apr 26, 2019, 10:22 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View