76 రోజుల్లో 'జెర్సీ' షూటింగు పార్టును పూర్తిచేశాను: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి
Advertisement
నాని కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి రూపొందించిన 'జెర్సీ' .. ఈ నెల 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజునే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని, ఏ సెంటర్స్ లో దూసుకుపోతోంది. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ .. "76 రోజుల్లో ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేశాము. క్రికెట్ కి సంబంధించిన సన్నివేశాల కోసమే 25 రోజుల పాటు చిత్రీకరణ జరిపాము. అందులో క్లైమాక్స్ మ్యాచ్ ను 8 రోజుల పాటు షూట్ చేశాము.

ఈ సినిమా  కోసం నాని క్రికెట్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. అందువల్లనే ఓ క్రికెటర్ బాడీ లాంగ్వేజ్ తో ఆయన ప్రేక్షకులను మెప్పించగలిగాడు. క్రికెట్ కి సంబంధించిన అన్ని సన్నివేశాలను కూడా పక్కన కోచ్ ను పెట్టుకునే షూట్ చేశాము. ఆయన సంతృప్తిని వ్యక్తం చేసిన తరువాతనే ఓకే చెబుతూ వచ్చాము. కథ విషయంలో ఎక్కడా రాజీ పడకపోవడం వల్లనే ఈ స్థాయి రెస్పాన్స్ వచ్చిందని భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.
Thu, Apr 25, 2019, 03:32 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View