ఎల్వీ సుబ్రహ్మణ్యం, జగన్ కలసి మోదీకి కవల పిల్లల్లా వ్యవహరిస్తున్నారు!: టీడీపీ నేత పంచుమర్తి అనురాధ
Advertisement
రాజ్యాంగంలోని ఆర్టికల్ 172 ప్రకారం ముఖ్యమంత్రికి సమీక్షలు చేసే అధికారం ఉంటుందని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ తెలిపారు. కానీ ముఖ్యమంత్రికి ఎలాంటి అధికారం ఉండదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో అనురాధ మాట్లాడారు.

రాజ్యంగానికి తూట్లు పొడిచేలా ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం, వైసీపీ అధినేత జగన్ కలసి ప్రధాని మోదీకి కవల పిల్లల్లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎస్ ఓ ప్రభుత్వాధికారిగా కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈసారి కూడా టీడీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని అనురాధ జోస్యం చెప్పారు.
Thu, Apr 25, 2019, 03:01 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View