నాని సినిమాని తప్పకుండా చూడమంటోన్న లారెన్స్
Advertisement
సాధారణంగా రెండు సినిమాలు థియేటర్స్ లో వున్నప్పుడు, ఒక సినిమా హీరో .. మరో హీరో సినిమా చూడమని చెప్పడం జరగదు. ఆ విధంగా చెప్పడం వలన తన సినిమా వసూళ్లపై ప్రభావం పడుతుందనే ఆలోచనే చేస్తారు. కానీ లారెన్స్ మాత్రం .. తన సినిమా 'కాంచన 3' థియేటర్స్ లో ఉండగా, నాని సినిమా 'జెర్సీ' తప్పకుండా చూడాలని చెప్పడం విశేషం.

లారెన్స్ హీరోగా చేసిన 'కాంచన 3' .. నాని హీరోగా చేసిన 'జెర్సీ' రెండూ  కూడా ఈ నెల 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఏ సెంటర్స్ లో 'జెర్సీ' .. బి -సి సెంటర్స్ లో 'కాంచన 3' వసూళ్ల పరంగా దూసుకుపోతున్నాయి. 'కాంచన 3' అంచనాలకి మించి వసూళ్లు రాబడుతూ ఉండటంతో, 'థ్యాంక్స్ మీట్' ను ఏర్పాటు చేశారు. ఈ వేదికపై లారెన్స్ మాట్లాడుతూ, తన సినిమాను ఆదరించినందుకు ధన్యవాదాలు తెలియజేశాడు. "నాని సినిమా 'జెర్సీ' చూశాను .. చాలా బాగుంది .. నాని అద్భుతంగా చేశాడు .. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసిన సినిమా" అంటూ చెప్పాడు. లారెన్స్ మాటలు ఆయన గొప్ప మనసును చాటుతున్నాయని అభిమానులు అంటున్నారు.
Thu, Apr 25, 2019, 02:52 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View