మరోసారి వాయిదాపడిన 'అర్జున్ సురవరం'
Advertisement
నిఖిల్ కథానాయకుడిగా సంతోష్ దర్శకత్వంలో 'అర్జున్ సురవరం' నిర్మితమైంది. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ సినిమా, 2016లో తమిళంలో వచ్చిన 'కణితన్' కి రీమేక్. అక్కడ ఆ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో, అదే దర్శకుడితో తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేశారు.

మే 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. అయితే ఆ రోజున థియేటర్స్ కి ఈ సినిమా రావడం లేదనేది తాజా సమాచారం. ఈ నెల 26వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో 'అవెంజర్స్ ' భారీస్థాయిలో విడుదల కానుంది. ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాపై ఉండటం వలన, ఆశించినస్థాయిలో థియేటర్స్ లభించకపోవడం వలన 'అర్జున్ సురవరం' విడుదలను మరోసారి వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. 
Thu, Apr 25, 2019, 01:07 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View