అప్పుడే బీజేపీకి ఆరోగ్యం, సైన్స్-టెక్నాలజీ శాఖ మంత్రి దొరికేసింది!: ఒవైసీ సెటైర్లు
Advertisement
బీజేపీ తరఫున భోపాల్ లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్న ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఇటీవల విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో 2010లో తాను జైలులో ఉండగా కేన్సర్ సోకిందనీ, అయితే ఆవు మూత్రంతో పాటు ఇతర గోసంబంధ ఉత్పత్తులతో కేన్సర్ ను పూర్తిగా నయం చేసుకున్నానని సెలవిచ్చారు. ఈ సందర్భంగా పంచగవ్య, ఆయుర్వేద మూలికలతో చికిత్స తీసుకున్నానని చెప్పారు.

తాజాగా ఈ వ్యవహారంపై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యంగ్యంగా స్పందించారు. ‘చూస్తుంటే బీజేపీకి కొత్త ఆరోగ్యం, సైన్స్-టెక్నాలజీ శాఖ మంత్రి దొరికినట్లు అనిపిస్తోంది. కానీ దురదృష్టవశాత్తూ మోదీ త్వరలోనే మాజీ ప్రధాని కాబోతున్నారు. కాబట్టి మోదీకి ఈ అద్భుతాన్ని చూసే మహాభాగ్యం దక్కదు’ అని ట్వీట్ చేశారు.
Thu, Apr 25, 2019, 12:44 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View