అఖిల్ సినిమాకి దేవిశ్రీని వద్దనుకోవడానికి కారణమదేనట!
Advertisement
అఖిల్ నాల్గొవ సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమా వచ్చేనెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ను తీసుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత తమన్ పేరు వినిపించింది. చివరికి గోపీసుందర్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం.

దేవిశ్రీ .. తమన్ లతో చేయడానికి అటు దర్శకుడు .. ఇటు అఖిల్ ఆసక్తిని చూపించారట. అయితే ఈ సినిమా బడ్జెట్ ను సాధ్యమైనంత తగ్గించాలనే ఉద్దేశంతోనే అల్లు అరవింద్ .. గోపీసుందర్ ను తీసుకున్నాడని అంటున్నారు. ఇక ఇటీవల గోపీసుందర్ అందించిన పాటలు యూత్ లోకి దూసుకుపోతుండటం కూడా ఆయన వైపు అల్లు అరవింద్ మొగ్గుచూపడానికి కారణమని మరికొంతమంది చెబుతున్నారు.
Thu, Apr 25, 2019, 12:44 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View