తినే వస్తువు అనుకుని బాంబును కొరికిన కుక్క.. ఒక్కసారిగా పేలుడు!
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఈరోజు బాంబు కలకలం సృష్టించింది. జిల్లాలోని తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో ఈరోజు ఓ కుక్క తినే వస్తువు అనుకుని ఓ బాంబును నోట కరుచుకుని వెళుతుండగా ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో సదరు శునకం అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

గ్రామస్తుల సమాచారంతో డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టిన పోలీస్ అధికారులు.. అసలు ఈ బాంబు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? స్థానికంగా ఏమైనా తయారు చేస్తున్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Thu, Apr 25, 2019, 12:32 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View