వైసీపీ పాటకు చిందేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే పుష్పవాణి.. సోషల్ మీడియాలో వైరల్!
Advertisement
సాధారణంగా రాజకీయ నేతలు ఎన్నికల ప్రచారంలో రకరకాల ఫీట్లు చేస్తుంటారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు దోసెలు వేయడం, కటింగ్ చేయడం  ఇస్త్రీ చేయడం లాంటి పనులు చేస్తుంటారు. మరికొందరు ఔత్సాహిక నేతలు రిక్షాలు, ఆటోలు కూడా నడుపుతుంటారు. అయితే చాలా తక్కువ మంది నేతలు మాత్రం కేడర్ తో కలిసి చిందులు వేస్తారు. వైసీపీ కురుపాం(ఎస్టీ) ఎమ్మెల్యే పుష్పవాని ఈ కోవలోకే వస్తారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా పుష్పవాణి అనుచరులతో కలిసి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రచార గీతం ‘గిరాగిరా తిరుగుతుంది ఫ్యాను.. అయ్యా నేను వైఎస్సార్ ఫ్యాను’ అనే పాటకు ఆనందంతో డ్యాన్స్ వేశారు. వైసీపీ కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి పుష్పవాణి చిందులేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను మీరూ చూసేయండి.
Thu, Apr 25, 2019, 12:02 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View