77 వేల రెడ్ కార్డులు ఇచ్చారు.. ముస్లింలను ఓటు కూడా వేయనివ్వలేదు: ఆజం ఖాన్
Advertisement
ముస్లింలను ఓటు వేయకుండా జిల్లా అధికార యంత్రాంగం అడ్డుకుందని ఉత్తరప్రదేశ్ రాంపూర్ నియోజకవర్గ అభ్యర్థి, ఎస్పీ కీలక నేత ఆజం ఖాన్ ఆరోపించారు. 'గత వారం రోజులుగా ముస్లింల ఇళ్లను లూటీ చేశారు. వారిని చితకబాదారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా చేయి చేసుకున్నారు. ఇంటి నుంచి బయటకు రావద్దంటూ 77 వేల రెడ్ కార్డ్స్ ను ఎలాంటి అధికారి సంతకం లేకుండా ముస్లింలకు ఇచ్చారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కూడా కాలరాశారు' అంటూ ఆజంఖాన్ మండిపడ్డారు. ఏప్రిల్ 18న రాంపూర్ లో పోలింగ్ జరిగింది. ఆజం ఖాన్ పై బీజేపీ అభ్యర్థిగా సినీనటి జయప్రద పోటీ చేశారు.
Thu, Apr 25, 2019, 11:58 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View