దాచుకున్న దోపిడీ సొమ్ము కోసమే జగన్ స్విట్జర్లాండ్ వెళ్లింది: టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్
Advertisement
స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ నాయకుడు, ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ ఆరోపణలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో దోచేసిన లక్ష కోట్లలో కొంత భాగం స్విట్లర్లాండ్ లోని బ్యాంకులో జగన్ దాచారని ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల కోసం ఆ డబ్బులో కొంత భాగం తెప్పించి వాడుకున్నారని, ఇంకా ఎంత మొత్తం బ్యాంకులో ఉంది, ఇతర లావాదేవీలు చూసుకునేందుకే స్విట్లర్లాండ్ కు జగన్ వెళ్లారన్న విషయం స్పష్టంగా అర్థమౌతోందని ఆరోపించారు.

ఏపీలో ఏం జరిగినా రాబందుల్లా బయటకొచ్చే వైసీపీ వాళ్లు, తెలంగాణలో ఇంటర్ ఫలితాల గందరగోళంపై నోరు మెదపట్లేదని, విద్యార్థుల ఆత్మహత్యలపై మాట్లాడట్లేదని విమర్శించారు. టీటీడీ బంగారం వ్యవహారాన్ని కూడా వైసీపీ రాజకీయం చేస్తోందని, దేవుడ్ని కూడా రాజకీయానికి వాడుకునే పార్టీ వైసీపీ అని దుమ్మెత్తిపోశారు.
Wed, Apr 24, 2019, 07:26 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View