దొంగదారిలో వచ్చి కేబినెట్ విధానాలనే తప్పుబడుతున్నారు: జూపూడి ధ్వజం
Advertisement
సీఎస్ అయి ఉండి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి స్థానంలో కూర్చొని ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎలా ఆదేశాలిస్తారని టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు జూపూడి మీడియాతో మాట్లాడుతూ సీఎస్ వ్యవహార శైలిపై మండిపడ్డారు. దొంగదారిలో వచ్చిన సీఎస్ అంటూ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై విరుచుకుపడ్డారు.

సీఈవోను పిలిపించుకుని సమీక్షలు నిర్వహించడం అసంబద్ధమన్నారు. రాష్ట్రపతి పాలనను సీఎస్ ద్వారా సాగించాలని చూస్తున్నారా? అంటూ కేంద్రం తీరుపై జూపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగదారిలో వచ్చి కేబినెట్ విధానాలనే తప్పుపడుతున్నారన్నారు. అసలు కేబినెట్ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు సీఎస్‌కు ఉండదని జూపూడి పేర్కొన్నారు
Wed, Apr 24, 2019, 10:01 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View