మరో మైలురాయిని అధిగమించిన కాళేశ్వరం ప్రాజెక్టు.. కేసీఆర్ హర్షం
Advertisement
పనులు ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో ఘనతలు సాధిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు మరో మైలురాయిని అధిగమించింది. అత్యంత కీలకమైన ఆరో ప్యాకేజీ నంది మేడారంలో భారీ మోటార్ రన్ విజయవంతమైంది. సాంకేతిక ప్రక్రియలన్నీ విజయవంతంగా పూర్తి కావడంతో అధికారులు నంది మేడారం సర్జ్ పూల్ నుంచి రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేశారు.

ఈ క్రమంలో కాళేశ్వరం మొదటి పంపు వెట్ రన్ విజయవంతం కావడంతో సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనుల్లో పాలు పంచుకున్న అధికారులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి 40 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామని కేసీఆర్ మరోమారు ప్రకటించారు. తెలంగాణ రైతుల తలరాతలు మార్చే ప్రాజెక్టుగా కాళేశ్వరాన్ని అభివర్ణించారు.
Wed, Apr 24, 2019, 07:05 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View