ఎన్నికల ప్రచారంలో దిగ్విజయ్‌కు షాక్.. మోదీని పొగిడిన కాంగ్రెస్ కార్యకర్త!
Advertisement
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌కు ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ కార్యకర్త నుంచే షాక్ తగిలింది. భోపాల్ లోక్‌సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న డిగ్గీ రాజా ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

అనంతరం ఒక యువ కాంగ్రెస్ కార్యకర్తకు మైక్ ఇచ్చి మోదీ గురించి మాట్లాడమనడంతో, ఆ యువకుడు మైక్ తీసుకుని, మోదీ సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించారని, ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశారంటూ కీర్తించడం మొదలు పెట్టడంతో కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడింది. ఈ ఘటనతో  అప్రమత్తమైన నేతలు యువకుడి చేతిలోని మైక్‌ని లాక్కొని వేదిక నుంచి దించేశారు.
Mon, Apr 22, 2019, 09:02 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View