రేపు శ్రీశైల భ్రమరాంబకు స్త్రీ వేషధారణలో కుంభహారతి ఇవ్వనున్న ఆలయ ఉద్యోగి
Advertisement
రేపు శ్రీశైల భ్రమరాంబికా అమ్మవారికి వైభవంగా కుంభోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి రెండు విడతలుగా సాత్విక బలి సమర్పించనున్నారు. అమ్మవారికి విశేషంగా నవావరణ, త్రిశతి, ఖడ్గమాల పూజలు, అష్టోత్తర శతనామ కుంకుమార్చనలు నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం అమ్మవారికి కుంభహారతి ఇవ్వనున్నారు. అమ్మవారికి స్త్రీ వేషధారణలో కుంభహారతి ఇవ్వటం ఆనవాయితీ. అందుకని, ఆలయ ఉద్యోగి ఒకరు స్త్రీ వేషధారణలో అమ్మవారికి ఆ హారతి ఇస్తారని ఆలయ వర్గాల సమాచారం. కుంభోత్సవంను తిలకించేందుకు పలు ప్రాంతాల నుంచి భక్తులు ఇప్పటికే శ్రీశైలం చేరుకున్నారు.
Mon, Apr 22, 2019, 08:45 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View