ఎల్బీ స్టేడియంలో కుప్పకూలిన ఫ్లడ్ లైట్ టవర్.. ఒకరి మృతి!
హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ టవర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఉద్యోగి సుబ్రహ్మణ్యం మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. అక్కడ ఉన్న పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ సమాచారం మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. కాగా, ఇందిరాపార్క్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలోని ఎగ్జిబిషన్ షెడ్ కూలిపోయింది. లక్డీకాపూల్ లో హోర్డింగ్స్ నేలకూలాయి. మారేడ్ పల్లిలో భారీ వృక్షాలు కూలిపోగా, మూడు కార్లు ధ్వంసమయ్యాయి.
Mon, Apr 22, 2019, 08:28 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View