విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తాం: ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు
Advertisement
వైసీపీ నాయకులు తలాతోకా లేకుండా మాట్లాడుతున్నారని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు విమర్శించారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర కేబినెట్ కు లేని కోడ్ ఆఫ్ కాండక్ట్, ఏపీకి మాత్రమే ఎందుకు? అని ప్రశ్నించారు. చంద్రబాబు సాధారణ సమీక్షలు మాత్రమే చేస్తున్నారని స్పష్టం చేశారు.

ఏపీ ప్రభుత్వం తొమ్మిది నెలల్లో తీసుకోవాల్సిన అప్పు ఒక నెలలో తీసుకున్నట్టు ఆనం రామనారాయణరెడ్డి చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఆనం వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని, రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల అప్పు ఉందంటూ విజయసాయిరెడ్డి అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.
Mon, Apr 22, 2019, 07:21 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View