అధికారుల తప్పులను విద్యార్థులపై నెట్టొద్దు: టీ-బీజేపీ నేత లక్ష్మణ్
Advertisement
Advertisement
ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై టీ-బీజేపీ నేత లక్ష్మణ్ మండిపడ్డారు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని అన్నారు. అధికారుల తప్పులను విద్యార్థులపై నెట్టొద్దని, అమాయకులైన విద్యార్థుల ప్రాణాలు తీయొద్దని అన్నారు. పాలనపై ప్రభుత్వం పట్టు కోల్పోయిందని, ప్రభుత్వానికి చేతకాక అధికారులపై నెపం వేస్తోందని, ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో పడిందని, విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
Mon, Apr 22, 2019, 07:08 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View