ఆ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో అడుగు పెడితే అవమానం జరిగేలా చూడండి: జైపాల్ రెడ్డి
Advertisement
పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయమై కేంద్రమాజీ మంత్రి జైపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో జరిగిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అభినందన సభలో జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేల విషయమై నియోజకవర్గాల్లో ఉద్యమాలు చేపట్టాలన్నారు. నియోజకవర్గాల్లోకి అడుగు పెడితే వారికి అవమానం జరిగేలా చూడాలని సూచించారు. పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను యాచకులుగా జైపాల్ రెడ్డి అభివర్ణించారు.  
Mon, Apr 22, 2019, 07:08 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View