థాంక్యూ ప్రధాన్ మంత్రి జీ... మోదీకి కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబునాయుడు
Advertisement
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 70వ పడిలో ప్రవేశించారు. ఇవాళ ఆయన జన్మదినం కావడంతో ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయం నుంచి అనేక కార్యక్రమాలతో బిజీగా గడిపిన చంద్రబాబు తనకు విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికీ సాయంత్రం  ఓపిగ్గా బదులిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయం చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. దానికి చంద్రబాబు వినమ్రంగా బదులిస్తూ, "మీ హార్దిక శుభాకాంక్షలకు థాంక్యూ ప్రధాన్ మంత్రి జీ" అంటూ ట్వీట్ చేశారు.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత జగన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ నేత సురేశ్ ప్రభు, ఒకప్పటి సహచరుడు రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ తదితరులు చంద్రబాబునాయుడి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

అయితే, చాలామందికి "థాంక్స్" తో సరిపెట్టిన చంద్రబాబు... బ్యాడ్మింటన్ ఆశాకిరణం కిదాంబికి మాత్రం ఎంతో ఆప్యాయంగా బదులిచ్చారు. "థాంక్యూ కిదాంబీ... నీ ప్రదర్శనతో ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలవడాన్ని ఇకముుందూ కొనసాగిస్తావని ఆశిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు.
Sat, Apr 20, 2019, 09:13 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View