కొన్ని సార్లు నాని నమ్మకం చూస్తే భయమనిపించేది: గౌతమ్ తిన్ననూరి
Advertisement
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా వచ్చిన సినిమా ‘జెర్సీ’. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ గురించి గౌతమ్ తిన్ననూరి ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అసలు ఈ కథ నానిని దృష్టిలో పెట్టుకుని రాసిందే కాదని, కథ రాసుకున్నాక మూడేళ్ల పాటు తన వద్దే ఉందని, ఎవ్వరికీ చూపించలేదన్నారు.

స్క్రిప్ట్ పూర్తయ్యాకే తన కథకు ఎవరైతే సరిపోతారనే విషయాన్ని ఆలోచించుకుంటానన్నారు. తన దగ్గరున్న కథల్లో ఇది తనకెంతో నచ్చిందన్నారు. కథల విషయంలో నానికి ఎంతో అనుభవముందని, తనకిది రెండో చిత్రమే కావడంతో నాని అనుభవాన్ని తాను జడ్జ్ చేయలేకపోయానన్నారు. కొన్ని సందర్భాల్లో నాని నమ్మకం చూస్తే తనకు భయమనిపించేదని తెలిపారు. నాని అంచనాలెప్పుడూ పై స్థాయిలోనే ఉంటాయని గౌతమ్ పేర్కొన్నారు.
Sat, Apr 20, 2019, 07:47 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View