గెలుస్తామనే నమ్మకంతో నేమ్ ప్లేట్ చేయించుకున్నారు.. తర్వాత పారిపోయారు: చంద్రబాబు
Advertisement
ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి అంటూ ఇటీవల వైసీపీ అధినేత పేరుతో సోషల్ మీడియాలో ఓ నేమ్ ప్లేట్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేమ్ ప్లేట్ వ్యవహారంపై నేడు సీఎం చంద్రబాబు స్పందించారు. నేడు తన పుట్టినరోజు వేడుకలను తిరుపతిలో నిర్వహించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ, వైసీపీ గెలుస్తుందనే నమ్మకంతో సీఎం పేరుతో నేమ్ ప్లేట్ సిద్ధం చేసుకున్నారని, అనంతరం అసలు నిజాలు తెలియడంతో ఆ పార్టీ నేతలు పారిపోయారని ఎద్దేవా చేశారు. తనకు అధికారులపై ఎలాంటి ద్వేషమూ లేదన్న చంద్రబాబు, అధికారులపై ఉన్న కేసులు, జగన్ వల్ల కలిగిన ఇబ్బందులను ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Sat, Apr 20, 2019, 07:10 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View