ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేళ.. రక్తదానం చేసిన నారా బ్రహ్మణి!
20-04-2019 Sat 15:21
- ఎన్టీఆర్ ట్రస్టులో రక్తదానం
- ముందుకు రావాలని ప్రజలకు పిలుపు
- ఫేస్ బుక్ లో స్పందించిన నారా లోకేశ్ భార్య

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన పుట్టినరోజును కుటుంబ సభ్యులు, పార్టీ నేతలతో కలిసి ఈరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత జగన్, నారా లోకేశ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ సహా పలువురు ప్రముఖులు చంద్రబాబుకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా చంద్రబాబు పుట్టినరోజు నేపథ్యంలో ఆయన కోడలు నారా బ్రాహ్మణి ఈరోజు రక్తదానం చేశారు. ఎన్టీఆర్ ట్రస్టులో రక్తదానం చేసిన అనంతరం ఆ ఫొటోను ఆమె ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ‘రక్తదానం చేయండి.. ప్రాణాలను కాపాడండి’ అని బ్రహ్మణి పిలుపునిచ్చారు.
More Latest News
అప్పు తీసుకుని తనపైనే బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ పోలీసులను ఆశ్రయించిన నటుడు సాయికిరణ్
6 hours ago

ద్రౌపది ముర్ముపై మరోసారి వ్యాఖ్యలు చేసిన వర్మ
6 hours ago

తెలంగాణలో 3 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు
8 hours ago

ఇతర దేశాల్లోను 'పుష్ప 2' చిత్రీకరణ!
8 hours ago
