జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులకు స్పైస్ జెట్ ఆపన్నహస్తం
Advertisement
జెట్ ఎయిర్ వేస్ విమానయాన సంస్థ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుని కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్ వేస్ కు చెందిన వేలమంది ఉద్యోగులు రోడ్డునపడ్డారు. వాళ్లలో కొందరు ఇతర ఎయిర్ లైన్స్ సంస్థల్లో తక్కువ జీతాలకే ఉద్యోగాలు చూసుకోగా, చాలామంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో, తామున్నామంటూ ముందుకు వచ్చింది స్పైస్ జెట్ విమానయాన సంస్థ.

ఇప్పటికే తాము జెట్ ఎయిర్ వేస్ కు చెందిన 500 మందికి ఉద్యోగావకాశాలు కల్పించామని, త్వరలోనే మరింతమందికి ఉపాధి కల్పిస్తామని స్పైస్ జెట్ యాజమాన్యం హామీ ఇచ్చింది. స్పైస్ జెట్ సీఎండీ అజయ్ సింగ్ మాట్లాడుతూ, ఉద్యోగాలు కోల్పోయిన జెట్ ఎయిర్ వేస్ సిబ్బందిని తాము విధుల్లోకి తీసుకుంటామని అన్నారు. త్వరలోనే మరిన్ని విమానాలు కొనుగోలు చేస్తున్నామని, అందువల్ల జెట్ ఎయిర్ వేస్ సిబ్బందికి తప్పకుండా అవకాశం ఉంటుందని తెలిపారు.
Fri, Apr 19, 2019, 10:01 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View