ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా తప్పతాగిన క్రికెట్ సంఘం సభ్యులు
Advertisement
చాలాకాలంగా వివాదాలకు మారుపేరుగా నిలుస్తున్న హైదరాబాద్ క్రికెట్ సంఘం మరోమారు వార్తల్లోకెక్కింది. ఐపీఎల్ లో చెన్నై-హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ సంఘం సభ్యులు తప్పతాగిన ఘటన తెరపైకి వచ్చింది. స్టేడియంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో క్రికెట్ సంఘం కార్యవర్గ సభ్యులు మందు పార్టీ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో ఖాళీ మందు బాటిల్స్ దర్శనమిచ్చాయి. ఈ ఘటనపై తెలంగాణ క్రికెట్ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసింది.
Fri, Apr 19, 2019, 09:43 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View