కర్కరేపై 'శాపం' వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా: సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ప్రకటన
Advertisement
బీజేపీ నేత సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ విమర్శల ఒత్తిడి కారణంగా వెనుకంజ వేశారు. 26/11 పేలుళ్ల కేసు హీరో, దివంగత పోలీసు అధికారి హేమంత్ కర్కరే తన శాపం తగిలే చనిపోయాడంటూ సాధ్వీ ప్రజ్ఞా సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను విచారణ సందర్భంగా అత్యంత కిరాతకంగా హింసించాడని మండిపడ్డారు.

అయితే, అన్ని వర్గాల నుంచి ఆమెపై ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఉగ్రవాదులను ఎదిరించిన ఓ జాతీయ హీరోను అంత మాట అంటావా అంటూ సాధ్వీపై నిప్పులు చెరిగారు. దాంతో, తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుంటున్నట్టు ఆమె ఓ ప్రకటనలో తెలిపారు.

"ఈ వ్యాఖ్యలు నా శత్రువులను సంతోషపెడుతున్నట్టయితే వెంటనే వాటిని వెనక్కి తీసుకుంటున్నా. అంతేకాదు, క్షమాపణలు కూడా తెలుపుకుంటున్నా. మన వ్యాఖ్యలు శత్రువులకు సంతోషం కలిగించేలా ఉండకూడదు. కానీ నేను అనుభవించిన బాధ ఎవరూ తీర్చలేనిది. ఏదేమైనా హేమంత్ కర్కరే ఉగ్రవాదుల చేతుల్లో మరణించాడు కాబట్టి ఆయన అమరవీరుడే" అంటూ వివరణ ఇచ్చారు.
Fri, Apr 19, 2019, 09:24 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View