భావోద్వేగాలతో నిండిన చిత్రం ‘జెర్సీ’.. చిత్రబృందానికి ఛీర్స్: మంచు మనోజ్
Advertisement
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. నేడు విడుదలైన ఈ సినిమా తొలి షోతోనే మంచి సక్సెస్ టాక్‌ను సంపాదించుకుంది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. ఈ సినిమాను చూసిన సినీ ప్రముఖులంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాను ఆకాశానికెత్తేశారు.

కొద్దిసేపటి క్రితం మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ‘నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ గౌతమ్‌ తిన్ననూరికి హృదయపూర్వక అభినందనలు. అందమైన, భావోద్వేగాలతో నిండిన చిత్రం ‘జెర్సీ’. చిత్రబృందానికి ఛీర్స్‌. తప్పకుండా చూడాల్సిన చిత్రమిది" అని మనోజ్‌ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌పై స్పందించిన నాని, థాంక్యూ బాబాయ్ అని రిప్లై ఇచ్చాడు.
Fri, Apr 19, 2019, 08:56 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View