అమరావతిలో ఇంటికి దిష్టిబొమ్మలుగా అనుష్క, హెబ్బా పటేల్ ఫొటోలు!
Advertisement
సాధారణంగా నిర్మాణంలో ఉన్న ఇళ్లకు, కొత్త ఇళ్లకు దిష్టి నివారణ కోసం రాక్షసుల బొమ్మలు, కొబ్బరికాయలు, గుమ్మడికాయలు కట్టడం చూస్తుంటాం! పంట పొలాల్లో మనిషి బొమ్మలు వికృతంగా తయారుచేసి దిష్టిబొమ్మగా నిలబెడతారు. కానీ ఈ మధ్య కొందరు సంప్రదాయ విరుద్ధంగా వ్యవహరిస్తూ సినీ తారల బొమ్మలను దిష్టిబొమ్మలుగా ఉపయోగిస్తున్నారు. పచ్చని పంట పొలాల్లో సన్నీ లియోన్ పోస్టర్లు తగిలించిన ఘటనలు కూడా జరిగాయి.

తాజాగా, ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటికి దిష్టిబొమ్మలుగా టాలీవుడ్ అందాలభామలు అనుష్క, హెబ్బాపటేల్ పోస్టర్లు కనిపించడం పిచ్చకు పరాకాష్ట అని చెప్పాలి. తమ బిల్డింగ్ ను చూసినవారి దృష్టి వెంటనే సినీ తారల పోస్టర్లపైకి మళ్లుతుందని, అందువల్ల తమ ఇంటికి నరదిష్టి సోకదని యజమానులు చెబుతున్నారు. రాజధాని ప్రాంతంలోని మందడం గ్రామంలో ఈ దృశ్యం కనిపించింది. 
Thu, Apr 18, 2019, 09:19 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View