పవన్‌పై కేఏ పాల్ ఆరోపణలు
Advertisement
ఎన్నికల్లో అవినీతిపై సుప్రీంకోర్టులో పిటీషన్ వేస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పష్టం చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ డబ్బులు పంచారని పాల్ ఆరోపించారు.

బీజేపీ అధికారంలోకి వస్తే ఇండియా మరో బురిండా, రువాండా అవుతుందన్నారు. 50 శాతం వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కించాలని డిమాండ్ చేశారు. మోదీకి వ్యతిరేకంగా 22 పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేయనున్నామని, బీజేపీ తరుపున ఉండాలో, కూటమి తరుపున ఉండాలో ప్రజలే తేల్చుకోవాలని కేఏ పాల్ పేర్కొన్నారు.
Thu, Apr 18, 2019, 08:54 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View