చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
Advertisement
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని నగరి సమీపంలోని వీకేఆర్ పురం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కైలాసకోనకు విహారయాత్ర కోసం ఇన్నోవా వాహనంలో పోరూరుకు చెందిన ఆరుగురు యువతీ యువకులు వచ్చారు. తిరుగు ప్రయాణంలో వారి వాహనం బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో ప్రతీక్ రాజు, ప్రేమ్, ఏంజెల్ మృతి చెందినట్టు పోలీసులు గుర్తించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మద్యం సేవించి వాహనం నడిపిన కారణంగానే ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాలను వారి స్వస్థలానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Thu, Apr 18, 2019, 08:41 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View