గడ్డం, చెవిపోగుతో ఆకట్టుకుంటున్న వరుణ్ తేజ్
Advertisement
వరుస విజయాలతో దూసుకుపోతున్న వరుణ్‌తేజ్ ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి అనే చిత్రంలో నటిస్తున్నాడు. రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ నేటి నుంచి జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం నేడు విడుదల చేసింది. గతంలో చేసిన ఏ సినిమాలోనూ కనిపించనటువంటి వినూత్న లుక్‌లో వరుణ్ కనిపిస్తున్నాడు.

గడ్డం, చెవిపోగుతో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సందర్భంగా ‘వాల్మీకి స్వాగతం.. తొలి రోజు షూటింగ్‌ అద్భుతంగా జరిగింది. ఇది ఇలాగే సాగాలని ఎదురుచూస్తున్నా. మండు వేసవిలో కష్టపడుతున్న సినిమాటోగ్రాఫర్‌ అయాంక్‌ బోస్‌కు ధన్యవాదాలు’ అంటూ హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు.
Thu, Apr 18, 2019, 08:21 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View