చంద్రబాబు తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసేలా ఉంది: జీవీఎల్
Advertisement
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమీక్షలు నిర్వహించడంపై విమర్శలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ, చంద్రబాబు తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే విధంగా ఉందని విమర్శించారు. ఈ దేశంలోని వ్యవస్థలను గౌరవించాలని, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో పాటించాల్సిన నియమావళిని గుర్తుపెట్టుకుని చంద్రబాబు తు.చ. తప్పకుండా పాటిస్తారని ఆశిస్తామని అన్నారు. అవి పాటించకపోతే ఎన్నికల కమిషన్ ద్వారా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 
Thu, Apr 18, 2019, 07:50 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View