జీవీఎల్ పై దాడి వెనుక ఎవరున్నా చర్యలు తీసుకోవాలి: బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి
Advertisement
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై చెప్పు విసిరిన సంఘటనపై ఆ పార్టీ నాయకుడు ఎన్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ఈ దాడిని ఏపీ బీజేపీ శాఖ తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇలాంటి చర్యల ద్వారా బీజేపీ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయలేరని అన్నారు. బీజేపీపై కుట్ర పూరితమైన చర్యల్లో భాగంగానే ఈ ఘటన జరిగిందని అన్నారు. ఈ ఘటన వెనుక ఎంతటి వారున్నా వారిపై చర్యలు తీసుకోవాలని, నిష్పక్షపాతంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు.
Thu, Apr 18, 2019, 07:39 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View