జగన్ గారూ.. ఈ వీడియో మీ కోసమే!: నారా లోకేశ్
Advertisement
ప్రస్తుతం దేశంలో ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరుపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈవీఎంల పనితీరుపై సానుకూలంగా స్పందించిన వైసీపీ అధినేత జగన్ పై ఏపీ ఐటీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ ప్రస్తుతం లోటస్ (కమలం-బీజేపీ) రక్షణలో ఉన్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. కాబట్టే పోలింగ్ వేళ ప్రజల ఇబ్బందులు కనిపించలేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఈరోజు ట్విట్టర్ లో లోకేశ్ స్పందిస్తూ..‘ తనకు అనుకూలంగా జరిగితే అంతా సవ్యంగా జరిగిందనీ, లేదంటే అక్రమం అని వాదించేవాళ్ళు స్వార్థపరులు. జగన్ గారూ! మీరు ప్రస్తుతం లోటస్ రక్షణలో ఉన్నారు. కమలం రేకులు కప్పుకున్న మీ కళ్ళకు ఏపీలో ఎన్నికల వేళ ప్రజలు పడిన ఇబ్బందుల్ని చూపించడం కోసమే ఈ వీడియో’ అని ట్వీట్ చేశారు. దీనికి ఓ వీడియోను నారా లోకేశ్ జతచేశారు.
Thu, Apr 18, 2019, 03:37 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View