కేసీఆర్, సోనియా, రాహుల్ లకు సంగారెడ్డిలో గుడికట్టిస్తా: జగ్గారెడ్డి
Advertisement
సీఎం కేసీఆర్ సహా ఇతర టీఆర్ఎస్ నేతలపై కొన్నాళ్ల కిందటి వరకు ఎడతెగని పోరాటం చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ మధ్య కాంగ్రెస్ సహచరులు కొరవడడంతో కాస్తంత నిదానించినా, విమర్శలు మాత్రం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి. రైతు పండించిన పంటకు తెలంగాణలో గిట్టుబాటు ధర కల్పిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని ఆయన స్వాగతించారు. అయితే, కేసీఆర్ తన నిర్ణయాన్ని ఏడాదిలోపు గనుక అమలు చేయగలిగితే సంగారెడ్డిలో ఆయనకు గుడి కట్టించి తీరుతానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

అంతేగాకుండా, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి, ఆమె తనయుడు రాహుల్ గాంధీకి కూడా గుడి కట్టిస్తానని చెప్పారు. తెలంగాణలో ప్రతిపక్షం అనేది లేకుండా చేశారని, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న అవినీతిని దేవుడు కూడా రూపుమాపలేడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి చోటుచేసుకోని శాఖ లేదు, అవినీతికి పాల్పడని నాయకుడు లేడు అంటూ జగ్గారెడ్డి మండిపడ్డారు.
Thu, Apr 18, 2019, 03:31 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View