పార్టీ కండువాతో పోలింగ్ బూత్ లోకి వెళ్లిన బీజేపీ నేత.. హౌస్ అరెస్ట్ చేయాలని ఈసీ ఆదేశం!
Advertisement
బీజేపీ నేత, బులంద్ షహర్ లోక్ సభ అభ్యర్థి భోలా సింగ్ కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు ఆయన్ను హౌస్ అరెస్ట్( గృహనిర్బంధం) చేయాలని ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భోలా సింగ్ బీజేపీ కండువాతో ఓ పోలింగ్ బూత్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడి భద్రతా సిబ్బంది ఆయన్ను అడ్డుకున్నారు. నిబంధనల మేరకు కండువాతో లోపలకు వెళ్లకూడదని సూచించారు.

కానీ జిల్లా మేజిస్ట్రేట్ కు ఫోన్ చేసిన భోలా సింగ్ భద్రతా సిబ్బందితో మాట్లాడించారు. అనంతరం కండువాతోనే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటింగ్ సరళిని పరిశీలించారు.  ఈ ఘటనకు సంబంధించిన వీడియో మీడియాలో వైరల్ గా మారడంతో బీజేపీ నేతను హౌస్ అరెస్ట్ చేస్తూ ఈసీ ఆదేశాలు జారీచేసింది. 2014 లోక్ సభ ఎన్నికల్లో భోలా సింగ్ తన ప్రత్యర్థి, బీఎస్పీ నేత ప్రదీప్ కుమార్ పై  4,21,973 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు.
Thu, Apr 18, 2019, 03:26 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View