టీడీపీ డేటాను దొంగిలించిన వారే తప్పుడు ప్రచారం చేస్తున్నారు: లంకా దినకర్
Advertisement
ఆధార్ డేటా చోరీ జరగలేదని యూఐడీఏఐ ప్రకటించిన విషయాన్ని ఏపీ టీడీపీ నేత లంకా దినకర్ మరోసారి గుర్తు చేశారు. టీడీపీ డేటాను దొంగిలించిన వారే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, డేటాను చోరీ చేసిన వాళ్లకు మోదీ చౌకీదార్ గా ఉన్నారని ఆరోపించారు. యూఐడీఏఐ ప్రకటనతో సేవామిత్ర యాప్ డేటాను దొంగిలించిన విషయం బయటపడిందని అన్నారు.

జగన్ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, తెలంగాణ ఓట్లు తొలగించినట్టుగానే, ఏపీలో 8 లక్షల ఓట్లు తొలగించాలని కుట్ర చేశారని అన్నారు. ఈ ఎన్నికల్లో 120కి పైగా అసెంబ్లీ, 20 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ఆశీస్సులతో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోందని జోస్యం చెప్పారు. మహిళా అభ్యర్థుల పైనా వైసీపీ నేతలు దాడులు చేశారని, దాడులు చేశామని ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డే ఒప్పుకున్నాడని వ్యాఖ్యానించారు.
Thu, Apr 18, 2019, 03:18 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View