ఇంట్లోని సొత్తును తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ భార్య.. ట్రాక్టర్ తో వెంటాడిన భర్త!
Advertisement
మాజీ భార్యను ట్రాక్టర్ తో వెంబడించి మరీ చంపేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. థ్రిల్లర్ సినిమా సీన్ ని తలపించే ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అక్కడి ఫ్లోరిడాలో ఉంటున్న డానీ స్టీవార్ట్(64) దంపతుల మధ్య అభిప్రాయభేదాలు రావడంతో 35 సంవత్సరాల తర్వాత చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు.

అయితే తాను మర్చిపోయిన కొన్ని వస్తువులను తెచ్చుకునేందుకు డానీ మాజీ భార్య ఈ నెల 17న ఆయన ఇంటికి వచ్చింది. అయితే ఇందుకు డానీ అంగీకరించలేదు. అవన్నీ తన సొమ్ముతో కొన్న వస్తువులనీ, వాటిని ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు. అయితే డానీ మాటను లెక్కచేయని మాజీ భార్య.. మొత్తం వస్తువులను కారులో వేసుకుని బయలుదేరింది.

ఆమె చర్యతో డానీ కోపం నషాళానికి అంటింది. పక్కనే ఉన్న ట్రాక్టర్ ను స్టార్ట్ చేసిన డానీ దానితో ఆమె కారును వేగంగా వెంబడించాడు. కారుకు దగ్గరగా వెళ్లి బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో కారు తుక్కుతుక్కు కాగా, డానీ మాజీ భార్య మాత్రం ప్రాణాలతో బయటపడింది. ఇది చూసిన అతను మరింత ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈసారి నేరుగా మాజీ భార్యను తొక్కించేందుకు ట్రాక్టర్ ను ఆమెపైకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో సదరు మహిళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సమీపంలోనే ఉన్న పోలీస్ స్టేషన్ లోకి పరిగెత్తింది. తన మాజీ భర్త నిర్వాకంపై అధికారులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు డానీ స్టీవార్ట్ ను అరెస్ట్ చేశారు.
Thu, Apr 18, 2019, 03:10 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View