ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం విఫలమైంది: వర్ల రామయ్య
Advertisement
ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం విఫలమైందని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇంత పనికిమాలిన ఈసీని ఎక్కడా చూడలేదని, ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును చెత్తబుట్టలో వేస్తున్నారని దుయ్యబట్టారు. కృష్ణా జిల్లాలో ఈవీఎంలను ఆర్వో తన ఇంటికి ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు.

కృష్ణా జిల్లా కలెక్టర్ నివేదికను ఎలా నమ్ముతారు? తప్పుడు నివేదిక ఇచ్చి ఉండొచ్చుగా అన్న అనుమానం వ్యక్తం చేశారు. కోడూరులో వందకు 107 శాతం ఓట్లు ఎలా వస్తాయి? దీనికి ఎన్నికల అధికారి సమాధానం చెప్పలేకపోయారని విమర్శించారు. ఈవీఎంలను ఆర్వో తన ఇంటికి తీసుకెళ్లిన ఘటనపై సీరియస్ గా దర్యాప్తు చేయాలని కోరుతూ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశామని అన్నారు. అయితే, ఈ విషయమై కలెక్టర్ ఏం లేదన్నారని ఆ ఆఫీసర్ తమతో చెప్పారని, ఏం లేదంటే సరిపోతుందా? అని వర్ల ప్రశ్నించారు.
Thu, Apr 18, 2019, 02:49 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View