ధనుశ్ హీరోగా 'మజిలీ' రీమేక్
Advertisement
శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా రూపొందిన 'మజిలీ' సినిమా, ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా, వసూళ్లపరంగా పుంజుకుంటూ హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. చైతూ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా తమిళ రీమేక్ రైట్స్ ను ధనుశ్ సొంతం చేసుకున్నాడట. తనే కథానాయకుడిగా ఈ సినిమాను సొంత బ్యానర్లో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఇక తెలుగులో సమంత .. దివ్యాన్ష కౌశిక్ పోషించిన పాత్రలను తమిళంలో ఎవరు చేస్తారో చూడాలి. ఈ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి, తమిళంలో దర్శకుడు ఎవరనేది కూడా ఆసక్తికరంగా మారింది.
Thu, Apr 18, 2019, 02:43 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View