రాఘవ లారెన్స్ ట్రస్ట్ కు చిరంజీవి విరాళం
Advertisement
మెగాస్టార్ చిరంజీవి నటించిన అనేక చిత్రాలకు రాఘవ లారెన్స్ కొరియోగ్రఫీ సమకూర్చిన సంగతి తెలిసిందే. చిరు, లారెన్స్ మధ్య ముఠామేస్త్రి చిత్రం నుంచి మంచి అనుబంధం ఉంది. సీనియర్ హీరోల్లో అద్భుతమైన డ్యాన్సర్ గా పేరుగాంచిన చిరంజీవిని లారెన్స్ ఎంతో అభిమానిస్తాడు. ఇక తన అభిమాని ఎదుగుదల చూసి చిరంజీవికి కూడా ముచ్చటేసింది. లారెన్స్ కొంతకాలంగా దర్శకుడిగా, హీరోగా కూడా మెరుగైన రీతిలో రాణిస్తున్నాడు. అంతేకాదు, సమాజానికి తనవంతు సాయంగా భారీస్థాయిలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. లారెన్స్ సేవాదృక్పథం చిరంజీవిని కూడా కదిలించింది.

 ఈ క్రమంలో ఆయన రాఘవ లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ కు రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు మెగాస్టార్ తరఫున ఆయన బావమరిది అల్లు అరవింద్ కాంచన-3 ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెక్ ను రాఘవ లారెన్స్ కు అందించారు. కాంచన-3 ప్రీరిలీజ్ ఫంక్షన్ బుధవారం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ కూడా హాజరయ్యారు. చిరంజీవి విరాళాన్ని చెక్ రూపంలో అందుకున్న లారెన్స్ ఆనందభరితుడయ్యారు.
Thu, Apr 18, 2019, 02:09 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View