టీడీపీ ఓడిపోవడం జరగదు, ఒకవేళ ఓడిపోతే ఫోరెన్సిక్ ఆడిట్ అడుగుతాం: హరిప్రసాద్
Advertisement
Advertisement
ఏపీలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం జరగదని, ఒకవేళ, ఓడిపోతే ఫోరెన్సిక్ ఆడిట్ కు డిమాండ్ చేస్తామని ప్రభుత్వ సాంకేతిక సలహాదారు హరిప్రసాద్ అన్నారు. ‘టీవీ9’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో తాను కూడా పాల్గొన్నానని , కొద్దోగొప్పో ఓటర్ల నాడి తెలుసుకోవడంతో పాటు సోషల్ మీడియా మేనేజ్ చేయడంలో ఎంతో కొంత తన పాత్ర ఉందని అన్నారు. ఎన్నికల సంఘం వన్ సైడెడ్ గా వ్యవహరించినప్పుడు అనుమానం రాకుండా ఎలా ఉంటుంది? అని ప్రశ్నించారు. టీడీపీ దాదాపు 140 ఫిర్యాదులు చేస్తే ఏ ఒక్క ఫిర్యాదుకు ఈసీ స్పందించలేదని విమర్శించారు.

‘ఈ మిషన్లు మనకు వద్దు. బ్యాలెట్ పేపర్లు తెచ్చుకుందాం’ అని హరిప్రసాద్ పిలుపు నిచ్చారు. ఓటర్ వెరిఫికేషన్ కు సాంకేతికత వాడుకోవాలని, ఓటు వెరిఫికేషన్ ఓటర్ నే చేసుకోనివ్వాలని అభిప్రాయపడ్డారు. ఓటర్  అసలైన ఓటరా? కాదా? అని గుర్తించేందుకు వారి ఆధార్ కార్డును చూడాలని లేదా బయోమెట్రిక్ విధానం అనుసరించాలని సూచించారు. ఆ తర్వాత బ్యాలెట్ పేపర్ ఓటర్ చేతికిస్తే ఓటేసే వెళతారని అన్నారు. అన్ని పోలింగ్ బూత్ ల్లో కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, స్క్రీనింగ్ ఏర్పాటు చేసుకోవాలని, టెక్నాలజీని వినియోగించుకుని అక్రమాలకు పాల్పడేందుకు ఎవరైనా వస్తే వారిని గుర్తించి చర్యలు తీసుకోవచ్చని సూచించారు.
Mon, Apr 15, 2019, 09:37 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View