రేపు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయనున్న వైఎస్ జగన్!
Advertisement
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మంగళవారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలవనున్నారు. ఏపీలో పోలింగ్ నేపథ్యంలో శాంతిభద్రతల అంశంపై జగన్ గవర్నర్ కు ఫిర్యాదు చేస్తారని తెలుస్తోంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తమ కార్యకర్తలపై దాడులు జరిగాయంటూ జగన్ తన ఫిర్యాదులో పేర్కొనే అవకాశాలున్నాయి. ముఖ్యంగా పోలింగ్ రోజు, ఆ తర్వాత టీడీపీ నాయకులు తమపై దాడులు చేశారని గవర్నర్ కు చెప్పనున్నట్టు సమాచారం. రేపు ఉదయం 11 గంటలకు జగన్ వెంట పార్టీ అగ్రనేతలు కూడా రాజ్ భవన్ కు వెళ్లనున్నారు.
Mon, Apr 15, 2019, 09:35 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View