'చిత్రలహరి' తొలి మూడు రోజుల వసూళ్లు
Advertisement
Advertisement
సాయిధరమ్ తేజ్ ఇంతకుముందు చేసిన ప్రేమకథా చిత్రాలలో కొన్ని .. థియేటర్లలో మంచి సందడి చేశాయి. ఆ కోవలోకి చెందినదిగానే ఆయన తాజా చిత్రం 'చిత్రలహరి' కనిపిస్తోంది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విభిన్నమైన ఈ ప్రేమకథా చిత్రంలో తేజు సరసన నాయికగా కల్యాణి ప్రియదర్శన్ .. నివేదా పేతురాజ్ నటించారు.

తెలుగు రాష్ట్రాల్లో తొలి మూడు రోజుల్లో ఈ సినిమా 7.95 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 9.50 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ను రాబట్టింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను 13 కోట్లకే అమ్మడం జరిగింది. అందువలన తొలివారంలోనే బ్రేక్ ఈవెన్ మార్కును దాటుతుందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగా అమెరికాలోను ఈ సినిమా జోరుమీద ఉంటే బాగుండేదనేది అభిమానుల మాట. తాజాగా ఈ సినిమాపై చిరంజీవి తన స్పందనను తెలియజేసిన విషయం తెలిసిందే. 
Mon, Apr 15, 2019, 06:01 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View