నాగబాబును తిట్టి చిరంజీవిని పొగిడితే మాలాంటి వాళ్లకు నచ్చదు: నటుడు శివాజీ రాజాకు హైపర్ ఆది కౌంటర్

08-04-2019 Mon 07:10

నరసాపురం జనసేన ఎంపీ అభ్యర్థి నాగబాబుకు ఓటెయ్య వద్దంటూ నటుడు శివాజీ రాజా ఇచ్చిన పిలుపునకు పవన్ వీరాభిమాని, జబర్దస్త్ ఫేం హైపర్ ఆది గట్టి కౌంటర్ ఇచ్చాడు. నాగబాబు పిల్లికి కూడా భిక్షం పెట్టడన్న శివాజీ రాజా ఆరోపణలపై హైపర్ ఆది మాట్లాడుతూ.. ఎవరి భిక్షంపై రెండేళ్లు ‘మా’ అధ్యక్షుడిగా పనిచేశారో చెప్పాలని ప్రశ్నించాడు. ఎవరి పని వాళ్లు చూసుకోవాలని, కుక్క పనిని గాడిద చేస్తానంటే కుదరదని పేర్కొన్నాడు.

శివాజీ రాజా అంటే తనకు గౌరవమేనన్న హైపర్ ఆది.. నాగబాబు గురించి ఆయన చెప్పినదాంట్లో ఒక్కటి కూడా నిజం లేదన్నాడు. వెంటనే ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాడు. చిరంజీవి అంటే తనకిష్టమన్న శివాజీ రాజా అదే నోటితో నాగబాబును తిట్టడం తమకు నచ్చదన్నాడు. పవన్ కల్యాణ్‌కు కూడా నచ్చదన్నాడు. నాగబాబు పిల్లికి భిక్షం పెట్టడని అనడం సరికాదని, జబర్దస్త్ ఆర్టిస్ట్ ఒకరికి మూత్రపిండం పాడైతే ఆపరేషన్ కోసం పది లక్షల రూపాయలు ఇచ్చారని హైపర్ ఆది గుర్తు చేశాడు.

‘మా’ ఎన్నికల్లో ఓడిపోయాననే అక్కసుతోనే ఇలా మాట్లాడుతున్నట్టు అర్థమైందని, అది మంచిది కాదని హితవు పలికాడు. దమ్ముంటే నరసాపురం సెంటర్‌కు వచ్చి మాట్లాడాలని, ఎవరిని ఎవరు తరిమి కొడతారో తెలుస్తుందని హైపర్ ఆది సవాల్ విసిరాడు.

..Read this also
ఏపీ సీఎం జగన్, మంత్రి విడదల రజని, తిరుపతి మేయర్ శిరీషలపై ధ్వజమెత్తిన సీపీఐ నారాయణ
  • తిరుపతిలో ప్రసూతి ఆసుపత్రి భవనం నగరపాలక సంస్థకు కేటాయింపు
  • అభ్యంతరం వ్యక్తం చేసి నారాయణ
  • జగన్ మహళా ద్రోహి అంటూ వ్యాఖ్యలు
  • రజని, శిరీష కూడా మహిళా ద్రోహులేనని విమర్శలు


..Read this also
తిరుపతి ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో చిరుతపులి సంచారం
  • అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద చిరుత
  • కుక్కలపై దాడికి ప్రయత్నం 
  • సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు
  • అప్రమత్తమైన వర్సిటీ అధికారులు 

..Read this also
ఈ నెల 20వ తేదీన కడప జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన
  • రాష్ట్రంలో కౌలు రైతుల బలవన్మరణాలు
  • కౌలు రైతు భరోసా యాత్ర చేపడుతున్న పవన్
  • శనివారం ఉమ్మడి కడప జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర


More Latest News
CPI Narayana slams AP CM Jagan and minister Vidadala Rajini
Leopard spotted at Tirupati SV Veterinary University campus
Pawan Kalyan will visit Kadapa district on August 20
Telangana state corona update
Dadisetti Raja comments on Pawan Kalyan
Police arrests psycho killer Rambabu
Nine transgenders selected to Chhattisgarh police Bustar Fighters unit
Drushyam 3 Movie Update
Nara Lokesh sensational comments on CM Jagan
Congress party terms PM Modi new slogan gimmick
Karthikeya 2 movie success meet
Suggest new name for MonkeyPox asked WHO
CM KCR take swipe at BJP leaders in Vikarabad rally
Chiranjeevi Movies Update
Railways tests longest goods train Super Vasuki
..more