గోరంట్ల మాధవ్ నామినేషన్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వ పిటిషన్ తిరస్కరణ!
25-03-2019 Mon 21:50
- స్టే విధించాలని కోరిన ఏపీ ప్రభుత్వం
- అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు
- సజావుగా సాగిన నామినేషన్ ప్రక్రియ
హిందూపురం లోక్ సభ నియోజక వర్గం వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ నామినేషన్ పై సస్పెన్స్ నెలకొన్న విషయం తెలిసిందే. నామినేషన్ దాఖలుకు నేడే చివరి రోజు కావడంతో, ఆయన నామినేషన్ విషయంపై పలు సందేహాలు తలెత్తాయి. ఏం జరుగుతుందోననే ఆసక్తి అందరిలోను నెలకొంది. ఈ నేపథ్యంలో మాధవ్ వీఆర్ఎస్ ను ఆమోదించాలని ట్రైబ్యునల్ వెలువరించిన తీర్పును హైకోర్టు సమర్ధించింది.
ట్రైబ్యునల్ ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం స్టే కోరుతూ వేసిన పిటీషన్ ను నిరాకరిస్తూ .. ఆయన నామినేషన్ వేసుకోవచ్చంటూ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సకాలంలో హైకోర్టు తీర్పు రావడంతో గోరంట్ల మాధవ్ తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దాంతో అప్పటివరకూ కొనసాగిన సస్పెన్స్ కి తెరపడింది.
More Latest News
తెలంగాణ ప్రభుత్వ బడుల్లో ఇక రోజూ యోగా, ధ్యానం
4 minutes ago

అనకాపల్లి జిల్లాలో రాయల్ బెంగాల్ టైగర్ సంచారం.. జీడితోటలో గేదెను చంపితిన్నట్లు గుర్తింపు
17 minutes ago

మోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో 144 సెక్షన్
40 minutes ago

జీఎస్టీ ఇక ‘గృహ సర్వనాశన ట్యాక్స్’.. పన్ను పరిధిలోకి మరిన్ని వస్తువులు తేవడంపై రాహుల్ గాంధీ ఫైర్
12 hours ago

'హ్యాపీ బర్త్ డే' మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్!
12 hours ago
