ఈ వివాదంలోకి మోహన్ బాబును లాగడం వెనుక పెద్ద కుట్ర ఉంది: దాసరి అరుణ్ కుమార్
Advertisement
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుపై దర్శకుడు దాసరి నారాయణరావు కోడలు సుశీల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాసరి నారాయణరావు తనయుడు అరుణ్ కుమార్ స్పందించారు. తమ కుటుంబ వివాదంలోకి మోహన్ బాబును లాగాలని ప్రయత్నించడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. సుశీల ఏదైనా చెప్పాలనుకుంటే నేరుగా తమతో మాట్లాడాలే తప్ప, మోహన్ బాబు పేరును ప్రస్తావిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అన్నారు. తన తండ్రి మృతి చెందిన తర్వాత తమ కుటుంబానికి మోహన్ బాబు పెద్దదిక్కుగా ఉన్నారని, అటువంటి వ్యక్తిపై సుశీల అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు.
Fri, Mar 22, 2019, 10:01 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View