ఆ ఫండ్స్ నుంచి పైసా కూడా కదపకుండా చూసుకున్నాం!: శివాజీరాజా
Advertisement
Advertisement
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేడు ప్రముఖ నటుడు నరేశ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీరాజా కూడా హాజరుకావడం విశేషం. ఈ సందర్భంగా శివాజీ రాజా మాట్లాడుతూ ‘మా’ కోసం తన నుంచి ఏ సాయం కావాలన్నా చేయడానికి తాను సిద్ధమేనని, అర్ధరాత్రి వచ్చి లేపినా సాయం చేస్తానని తెలిపారు.

‘మా’ కమిటీ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నానన్నారు. తనకంటే ముందు అధ్యక్షులుగా పని చేసినవారు, ‘ఫండ్స్ కష్టపడి తీసుకొచ్చాం. వాటిలో నుంచి పైసా కూడా కదపకుండా చూసుకున్నాం. మీరు అలాగే ఫండ్స్ తీసుకురావాలి’ అని కోరారన్నారు. తానూ వారి మాటను గౌరవించానని.. అలాగే ప్రస్తుతమున్న కమిటీ కూడా అంతే కష్టపడాలని ఆశిస్తున్నానన్నారు.
Fri, Mar 22, 2019, 09:02 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View