కేఏ పాల్ ఒక జోకర్.. బ్రోకర్.. రోజూ వచ్చి కామెడీ చేస్తుంటాడు: విజయసాయి ఫైర్
Advertisement
Advertisement
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై వైసీపీ నేత విజయసాయిరెడ్డి మండిపడ్డారు. పాల్ ఒక జోకర్ అని.. బ్రోకర్ అని.. రోజూ వచ్చి కామెడీ చేస్తుంటాడని ఎద్దేవా చేశారు. నేడు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాశాంతి పార్టీ గుర్తు, కండువా, తమ పార్టీ గుర్తు, కండువాలను పోలి వున్నాయని, కాబట్టి ప్రజాశాంతి పార్టీ గుర్తు తొలగించాలని ఈసీని కోరినట్టు తెలిపారు. టీడీపీ అధికార దుర్వినియోగంపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు.

వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని, తమ పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ, ప్రకాశం జిల్లా ఎస్పీని విధుల నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు దగ్గరుండి నారాయణ కాలేజీ నుంచి డబ్బు తరలించారని.. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను సీఈసీకి అందజేసినట్టు తెలిపారు. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రభుత్వం, పోలీసుల పనితీరును ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.
Fri, Mar 22, 2019, 07:42 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View